ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song: #03
యేసు నాయకుడ - యెల్ల వేళలను నీ – దాసుల
నేలుమయ్యామోసము లన్నిటి – మునగద్రోతునని – బాసుల జేసిన – ప్రభుడవు నీవెగా
1. రేయింబవలు మా – న్యాయము చెరిపెడి – మాయ పిశాచిని
త్రోయుమి దూరము – బాయక భక్తుల – చేయి విడువని బహుశ్రేష్టుడ నీవెగా
2. హృదయము లోకము - మది పాపము మమ్ము – సతతము శ్రమ పెట్టును
సదయుడ మమ్మును – వదలక నిత్యము – మది తలపులలో – మహిమగ నేలుమీ
3. కాపాడుమి మమ్ము – మాపు రేపు నీ – శ్రీ పాదము లోద్దను
ఏ పాపములను ఎలకుండగ నీ – ప్రాపునబెంచుము – మాపాలకుడవో
4. మా కొరకై నీ – మేనును మ్రానున – మేకులతో గోట్టగ
మానము మహిమలు – మనుజుల కియ్యను – భానుడ రాజుగ – బ్రతికిలేచితివి
5. చెఱను చెఱనుగా – మరి పట్టుక నీవు – పరమున కరిగితివే
వరముల నిడితివి – ధరలో నరులకు – పరముడ నీ దయ మరువశక్యమా
Conversation
Your voice matters. Discussions are moderated for civility.
Post a Comment