ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song: #22
వ్యోమ సింహాసనస్థుఁడ యుర్వి పాదపీఠస్థుఁడ మామకీన దయా
మయుఁడ మమ్ముఁగావుమో దేవుఁడ ||వ్యోమ||
1. అంతరిక్ష లోకదీప యద్భుతాదృశ్య స్వరూపా యింత నీ మహిమనోప
నెంతది నా నాల్క చూప ||వ్యోమ||
2. గాలి ఱెక్కల పైనెక్కి గాఢాంధకారమునందు నేలికవై సంచరించు
నట్టి నిన్ను మ్రొక్కుచుందు ||వ్యోమ||
3. నీతి న్యాయ దీర్ఘశాంతా నిర్మల దయా నితాంతా
ప్రీతినుంచవే శ్రీమంతా పెద్దఁగా నా కాలమంతా ||వ్యోమ||
4. సర్వ భూలోక పూజితా సత్య సద్గుణ రాజితా గర్వ దుస్స్వభా
వాహితా కావునాన్ని నాట పితా ||వ్యోమ||
5. నమ్మిన యీనన్నఁ తూల నాడవు దీనాత్మపాలా
క్రమ్మి నీ ప్రేమతోఁ జాల బ్రోతువు దయాలా వాలా ||వ్యోమ||
Conversation
Your voice matters. Discussions are moderated for civility.
Post a Comment