ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song: #21
త్రిత్వమై నిత్యత్వమున నేకత్వమగు దేవా నీ సత్యసామర్థ్యత్వముల
నిజ తత్వము గణించి నిను నిత్యము స్తుతించెదను ||త్రిత్వమై||
1. ఎల్లలోకంబుల సృజించిన చల్లని తండ్రి నా యుల్లమున నీ గొప్ప వింత
లెల్ల సంతసిల్ల శోభిల్లఁ దలంచెదను ||త్రిత్వమై||
2. వాసి కెక్కిన పరమరాజ్యని వాసమును విడిన శ్రీ యేసునాధుండను
కుమారా దోషుల దోసంబులెల్లఁ గాచి రక్షించినావు ||త్రిత్వమై||
3. ఆదరణకారుండ వగు శుద్ధాత్ముడా దేవా యామోద నామము
నంపఁబడి యేసు నాధుని సుబోధ లెల్ల బోధపరచి పాదుకొల్పు ||త్రిత్వమై||
4. ఓపితా సుతా శుద్ధాత్మ ఒక్క దేవుఁడవు ఎల్ల పాపులను రక్షింప
మిగుల నోపికతో నాపదలు బాపి కృపఁ జూపినావు ||త్రిత్వమై||
Conversation
Your voice matters. Discussions are moderated for civility.
Post a Comment