ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song: #06
భీకరుండౌ మా యెహోవా – పీఠ మెదుటన్ గూడరే
ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే ||భీకరుండౌ||
1. మట్టితోనే మమ్ము నెల్ల – మానవులుగ సృజించెను
ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము || భీకరుండౌ ||
2. ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెను
ధారుణిన్ దానొక్కడే మా – దైవమని పూజింతుము || భీకరుండౌ ||
3. పుట్టగిట్టన్ జేయ దానై – నట్టి దేవుని శక్తిని
బట్టుగా లోకస్తులారా – ప్రస్తుతింపరే భక్తిని || భీకరుండౌ ||
4. మేటి సంగీతంబులపై – మింట నారవ మొందను
జాటరే వేవేల నోళ్ళన్ – సన్నుతుల్ ప్రభు వందను || భీకరుండౌ ||
5. మిక్కిలి కష్టంబులతో – మిత్తికిని బాల్పొందను
దిక్కు లేని గొర్రెలట్లు – దిరుగ జేర్పన్ మందను || భీకరుండౌ ||
Conversation
Your voice matters. Discussions are moderated for civility.
Post a Comment