మీరు క్షమించుడి దేవుడు మిమ్మును ఫలింప చేస్తారు.
దేవుడు కూడ అదే చెప్పారు " నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను - మత్తయి 22:39". నీవు ఎప్పుడైతె పూర్తిగా వారిని క్షమించి ప్రేమిస్తావో అప్పుడు నీ జీవితం ఫలవంతంగా మారుతుంది. నీవు క్షమించ లేనప్పుడు ఎలా ప్రేమిస్తావు ప్రేమించలేవు పైకి క్షమించి లోపల వారిపై కోపం, ద్వేషం, అసూయ పెట్టుకోవడం వలన నీ జీవితంలో దేవుడు ఫలింపచెసె ఫలాలను నీవు చూడలేవు. నీవు ఫలించాలని అనుకుంటె ముందుగా క్షమించు.
మానవుడు ఏదైనా చేయగలిగే సామర్థ్యం కలిగిన వ్యక్తి కాని క్షమించలేడు ఎందుకంటె సాతానుకి మీరు ఫలించటం, ఎదగడం, అభివృద్ధి చెందటం ఇష్టం లేదు కాబట్టి మీ మనసుకి క్షమించాలి అనె ఆలోచనను రాకుండా చేస్తుంది. మీరు క్షమించ లేనప్పుడు, ప్రేమించలేనప్పుడు దేవుడు మీ మీద చూపె ప్రేమను మీరు ఎలా అర్థం చేసుకోగలరు చేసుకోలేరు. మీరు దేవుని ప్రేమను నిజముగా అర్దం చేసుకుంటె మీ సహోదరుని క్షమించి ప్రేమిస్తారు.
దేవుడు కోరుకునేది అదే...
#క్షమించుడి #ప్రేమించుడి #ఫలించుడి
Conversation
Your voice matters. Discussions are moderated for civility.
Post a Comment