Bible stories of jephthah | bible stories in telugu | యెఫ్తా | Worship Series Telugu


 

Latest Topics

6/recent/ticker-posts
404

404

It looks like the page you’re looking for doesn’t exist. Maybe it was moved, deleted, or the URL was mistyped.

What you can do?

Bible stories of jephthah | bible stories in telugu | యెఫ్తా | Worship Series Telugu

 



యెఫ్తా
ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేసేవారు కాదు. చుట్టు ప్రక్కల వున్న ప్రజలను, వారి రాజులను లెక్క చేసేవారు కాదు. యెహోవా దేవుడు వారిని అన్ని సమయాల్లో కాచి కాపాడుతూ వుండేవాడు. ఒకసారి అమ్మోనీయులు అంతా ఒకటై ఇశ్రాయేలు దేశం పైకి దండయాత్ర చేశారు. వారు తమ సైన్యంతో గిలాదు దగ్గర సిద్ధంగా వున్నారు. గిలాదు నగర వాసుల్లో అమ్మోనీయులను ఎదిరించగల్గిన వీరుడెవరూ లేరు. గిలాదు పెద్దలందరు కలిసి ఆలోచించి ఒక ప్రకటన చేశారు. "అమ్మోనీయులతో యుద్ధం చేసేవాడు గిలాదు నివాసులందరికి ప్రధానుడౌతాడు”.


యెఫ్తా గిలాదుకు చెందినవాడు. గొప్ప శౌర్య సాహసములు కలవాడు. మహా బలశాలి. అయితే వేశ్య కుమారుడు. కాబట్టి అతని సహోదరులు తరిమివేసినందున టోబు దేశంలో వుంటున్నారు. యిప్పుడున్న సంకట పరిస్థితి నుండి తప్పించగలిగిన సమర్ధుడు, వీరుడు యెఫ్తా మాత్రమే అని గిలాదు
వారు నమ్మారు. అందరు కలసి యెఫ్తా దగ్గరికి వెళ్లారు. "మా ప్రాణాలను కాపాడు. శతృవుల బారి నుండి మమ్ములను రక్షించు, గిలాదుకు నిన్నే ప్రధానిగా
చేస్తాము" అని దీనంగా వేడుకొన్నారు. యెఫ్తా మొదట అంగీకరించలేదు. “మీరంతా కలసి నన్ను నగరం నుండి తరిమివేశారు. ఇప్పుడు ఆపద మీదికి రాగానే నా దగ్గరికి ఎందుకు వచ్చారు?" అన్నాడు. అయితే ఆఖరికి వారి కోరిక అంగీకరించాడు. మిస్సాలో, యెహోవా సన్నిధిలో, తమకు వున్న సంకట పరిస్థితిని వివరించాడు. సహాయం చేయమని అర్థించాడు. యెఫ్తా అమ్మోనియా రాజు వద్దకు దూతలను పంపాడు. "నీవు మా దేశం మీదికి దండెత్తి వచ్చుటకు కారణమేమి?" అని అడిగించాడు. అందుకు అమ్మోనీయుల రాజు యిలా సమాధానం యిచ్చాడు. "మీరు 300 సం||ల క్రిందట, ఐగుప్తు దేశం నుండి కానాను వచ్చునప్పుడు అర్నోను నుండి యబ్బోకు వరకు, యోర్దాను నది వరకు, నా దేశాన్ని ఆక్రమించుకొన్నారు. యిప్పుడు మీరు ఆక్రమించుకున్న దేశాన్ని నాకు అప్పగించండి. లేకుంటే నేను మీతో యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని తిరిగి నా స్వాధీనం చేసికొంటాను. అప్పుడు యెఫ్తా "మా పూర్వీకులైన ఇశ్రాయేలీయులు ఎప్పుడో 300 సం॥ల క్రితం అమ్మోరీయుల రాజైన సీహోనును ఓడించి, అతని ప్రజలను సంహరించారు. అర్నోనునది నుండి యబ్బోకు వరకు, అరణ్యము నుండి యోర్దాను నది వరకు వున్న అతని దేశాన్ని స్వాధీనం చేసికొన్నారు. యిప్పటివరకు ఆ ప్రదేశాన్ని తమ స్వాస్థ్యంగా అనుభవిస్తున్నారు. యిన్ని సం॥లు గడిచిపోయిన తర్వాత నీవు ఈ నెపముతో మా పైకి దండెత్తి రావడం మంచి పని కాదు. యిప్పుడు నీకు వున్న రాజ్యంతో తృప్తి పడి, వెనక్కు తిరిగి వెళ్లు" అని దూతలతో చెప్పి పంపించాడు. కాని అమ్మోనీయుల రాజు యెప్తా మాటలను పెడచెవిన పెట్టాడు. కాబట్టి యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. యెఫ్తా యుద్ధానికి బయలుదేరే ముందు యెహోవాకు యిలా మొక్కుకొన్నాడు. “దేవా, నేను అమ్మోనీయులతో యుద్ధం చేసి, వారిపై విజయం సాధించి, క్షేమంగా నా యింటికి తిరిగి వచ్చిన సమయంలో యింటినుండి నన్ను ఎదుర్కొనడానికి ఏది వస్తుందో దానిని నీకు ప్రతిష్ఠిస్తాను."



యెఫ్తా అమ్మోనీయుల సైన్యాన్ని ఓడించి తరిమివేశాడు. వారి దేశంలో యిరువది పట్టణాలను నాశనం చేసి, వాటిలోని ప్రజలను సంహరించాడు.
యెప్తా విజయోత్సాహంతో మిస్సాలో వున్న తన యింటికి వచ్చాడు. అతని కుమార్తె అమిత సంతోషంతో, తంబురతో నాట్యము చేస్తూ అతనిని
ఎదుర్కొన్నది. యోకు కుమారులు లేరు. ఆమె ఒక్కతే కుమార్తె. ఆమె ఎదురైనందుకు యెఫ్తా ఎంతో దుఃఖపడ్డాడు. తన బట్టలు చింపుకొని యేడ్చాడు.
తాను దేవునితో చేసిన ప్రమాణం గురించి కుమార్తెతో చెప్పాడు. “దేవునికి యిచ్చిన మాట తప్పలేను” అన్నాడు. అందుకు ఆమె ఏమీ బాధపడలేదు. "తండ్రీ ! నీవు దేవునితో ప్రమాణం చేశావు. కనుక నన్ను ప్రతిష్ఠించే విషయంలో ఏమీ చింతించవద్దు. రెండు నెలలపాటు నన్ను, నా స్నేహితురాండ్రను స్వేచ్ఛగా వదిలి పెట్టు, మేము కొండల పైకి వెళ్ళి నా కన్యాత్వము నిమిత్తము ప్రలాపిస్తాము”. అని తండ్రితో చెప్పింది. యెఫ్తా తన కుమార్తె కోరికను అంగీకరించాడు. రెండు నెలల తర్వాత యెఫ్తా తన కుమార్తెను యెహోవాకు ప్రతిష్ఠించాడు. ఈ విధంగా తాను దేవునికి చేసిన ప్రమాణం నెరవేర్చాడు. ఇశ్రాయేలు కన్యలు ప్రతి సం||ము నాలుగు రోజులపాటు యెఫ్తా కుమార్తెను జ్ఞాపకం చేసికొని, ఆమెను గౌరవిస్తారు. ఆమె త్యాగాన్ని పొగడి, ఆమెను ప్రసిద్ధి చేస్తారు. దేవుడు యెఫ్తాకు విజయం చేకూర్చాడు. యెఫ్తా తన ప్రమాణం నెరవేర్చాడు.

Any Bible story you want comment below...

Post a Comment

0 Comments

Contact Us
New Update